ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఈడీ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లో ఈడీ టీమ్ ఇవ్వాళ ఉదయం సోదాలు చేపట్టింది. 25 టీమ్ లుగా ఈడీ విడిపోయి, హైదరాబాద్ లోని కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే… కొన్ని రోజుల క్రితం జరిగిన తనిఖీల్లో రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పుడు మరిన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు హైదరాబాద్ తో వున్న లింకులను తాము కోర్టులోనే సమర్పిస్తామని తేల్చి చెప్పారు. దీనిపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని కోర్టు ఆదేశించిందని, అందుకే తాము ఆధారలన్నీ కోర్టులోనే సమర్పిస్తామని తెలిపారు. ఈ స్కామ్ కు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద వున్నాయని, హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఇవన్నీ ఉన్నాయని పేర్కొన్నారు.