ఢిల్లీ లిక్కర్ అవినీతి కేసులో ఈడీ మరో సారి దేశ వ్యాప్తంగా దాడులు చేసింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. జూబ్లీహిల్స్, కూకట్ పల్లితో సహా మరో నాలుగు చోట్ల ఈడీ సోదాలు చేసింది. సోదాలు జరిగిన రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. 3 నెలల నుంచి దాదాపు 500 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని అన్నారు. అయితే.. ఈ స్కాంలో ఇప్పటికే అరెస్టైన విజయ్, మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకే ఈడీ దాడులు చేసింది. 

 

సీఎం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన లిక్కర్ పాలసీలో అనేక అవకతవకలు వున్నాయని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దీనిని వెనక్కి తీసుకుంది. అయితే.. దీనిపై దర్యాప్తు చేయాలని ఎల్జీ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. అంతేకాకుండా ఇందులో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాత్రను కూడా ప్రస్తావించింది. దీంతో సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు కూడా చేసింది.