ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ అవినీతి కేసులో హైదరాబాద్ లో ఈడీ ఐదు చోట్ల మళ్లీ సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేశారు. రెండు, మూడు గంటల పాటు వెన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేసి.. లిక్కర్ లింకులు, మనీలాండరింగ్ పై ఆరా తీసే ప్రయత్నం చేశారు.

 

తర్వాత శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీస్ కు తరలించారు. అక్కడ కూడా వెన్నమనేని శ్రీనివాసరావును విచారిస్తున్నారు. ఇక… బిల్డర్ శ్రీనివాస రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేసింది. రామంతాపూర్ లోని సాలిగ్రామ్ సంస్థలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. రామంతాపూర్ లోని సాలిగ్రామ్ సంస్థలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.