టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల ఉల్లంఘణపై వివరణ ఇవ్వాలంటూ ఈడీ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు కూడా చేశారు. అంతేకాకుండా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి 2015 లో మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై 2015 లోనే ఈడీ కేసు నమోదు చేసింది. బంగారం మైన్స్ లో పెట్టుబడుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘిచి, పెట్టుబడులు పెట్టారన్నది ఆయనపై వచ్చిన అభియోగం.