అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకూ సిసోడియా చుట్టూ తిరిగిన ఈ కేసు… రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ తర్వాత ఒక్కసారిగా ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అయితే… ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారించేందుకు గురువారం తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే…. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

 

ముందస్తు కార్యక్రమాల వల్ల ఆ రోజు విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 11 న విచారణకు హాజరు అవుతానంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయానికి లేఖ రాశారు. అయితే…. దీనిపై ఇప్పటి వరకూ ఈడీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠత నెలకొంది. మరోవైపు గురువారం కవిత మీడియా ముందుకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కవిత మీడియా సమావేశం పెట్టనున్నారు. ఇక… శుక్రవారం జంతర్ మంతర్ వేదికగా కవిత మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దీక్ష చేయనున్నారు.

 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నోటీసులివ్వడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే… ఇప్పటికే షెడ్యూల్ ప్రకార కార్యక్రమాలు వున్నందున ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది మాత్రం ఇంకా ఉత్కంఠగానే వుంది. ఈ నెల 10న జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ధర్నా చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్ల కోసం రెండు రోజుల ముందే ఢిల్లీకి పయనమవుతున్నట్లు కవిత ముందే తెలిపారు.