టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ భారీ ఝలక్ ఇచ్చింది. ఆయనకు చెందిన 80.66 కోట్లను జప్తు చేసినట్లు ఈడీ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని మధుకాన్ గ్రూప్ కార్యాలయంతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని స్థిరాస్తులను అటాచ్ చేశామని ఈడీ పేర్కొంది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరిట ఎంపీ నామా రుణాలు తీసుకున్నారని, వాటిని దారి మళ్లించారని ఈడీ పేర్కొంది. సుమారు 361.92 కోట్లు నేరుగా మళ్లించారని, అది తాము గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది.