ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమీర్ మహింద్రును అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ అవినీతి కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. తాజాగా ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని క్రిమినల్ సెక్షన్ల కింద మహేంద్రును అదుపులోకి తీసుకున్నారు. చాలా సేపు ఈడీ ఆయన్ను కార్యాలయంలో విచారించింది. ఆ తర్వాత అరెస్టు చేసింది. ఇంకా లోతుగా విచారించేందుకు రిమాండ్ కోసం స్థానిక కోర్టుకు తరలించనున్నారు. విజయ్ నాయర్, సమీర్ మహింద్రు మధ్య లావాదేవీలు నడిచినట్లు అధికారులు గుర్తించారు. మహింద్రు నుంచి విజయ్ నాయర్ ద్వారా.. మనీష్ సిసోడియా సన్నిహితుడు అర్జున్ పాండేకు 4 కోట్లు ముట్టినట్లు సీబీఐ ఆరోపించింది .

 

 

మద్యం ముడుపు కేసు దర్యాప్తులో భాగంగా 24 గంటల వ్యవధిలోనే సీబీఐ, ఈడీ ఇద్దర్ని అరెస్ట్ చేశాయి. మొదట మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్ నాయర్ ను సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు విజయ్ నాయర్ సన్నిహితుడని సమాచారం. విజయ్ నాయర్ తరపున లిక్కర్ వ్యాపారీ సమీర్… మనీశ్ సిసోడియా అనుచరుడైన అర్జున్ పాండేకు ముడుపులు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ అరెస్టులు హైదరాబాద్ లో ప్రకంపనలు రగులుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఈ కేసులో నిందితుడిగా వుండటం, ఇప్పటికే సీబీఐ సోదాలు చేయడంతో ఏ క్షణమైనా ఈడీ నగరానికి రావొచ్చని అంటున్నారు.

Related Posts

Latest News Updates