ఢిల్లీ మద్యం అవినీతి వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు, ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ నేడు అరెస్ట్ చేసింది. ఆయన గురుగ్రామ్ లోని బుడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అమిత్ అరోరా డైరెక్టర్ గా వున్నారు. లిక్కర్ కేసులో అమిత్ అరోరాను అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. మరోవైపు అరోరాను నేడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అమిత్ అరోరాతో పాటు దినేశ్ అరోరా, అర్జున్ పాండే మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. ద్యం కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని ఈడీ అరెస్ట్ చేసింది.