మునుగోడు బై పోల్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 7 న నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 3 న ఉప ఎన్నిక వుంటుందని ఈసీ ప్రకటించింది. ఎన్నికలు జరిగిన మూడు రోజులకు అంటే.. నవంబర్ 6 న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఈనెల 14 వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉప సంహరణ ఈ నెల 17. మరోవైపు 5 రాష్ట్రాలైన మహారాష్ట్ర, బిహార్, హర్యానా, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్రం విడుదల చేసింది.
ఇక.. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అయితే.. కాంగ్రెస్ పక్షాన పాల్వాయి స్రవంతి బరిలోకి దిగనున్నారు. బీజేపీ పక్షాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో వుండనున్నారు. ఇక.. అధికార టీఆర్ఎస్ పక్షాన ఎవరన్నది ఇంకా తేలడం లేదు.