కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈసీ విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941డ మంది ఓటర్లు వున్నారు. ఇందులో 50 లక్షల 48 వేల 250 మంది పురుషు ఓటర్లు కాగా… కోటి 49 లక్షల 24 వేల 718 మంది మహిళా ఓటర్లు వున్నారు. హైద‌రాబాద్ జిల్లాలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 42,15,445, రంగారెడ్డి జిల్లాలో 31,08,068, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 25,24,951 మంది ఓట‌ర్లు ఉన్నారు. అత్య‌ధికంగా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 6,44,072 మంది ఓట‌ర్లు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఇక.. ఏపీలో మొత్తం 3,99,84,868 మంది ఓటర్లు వున్నారు. ఇందులో పురుష ఓట్లు 2,01,32,271, మహిళా ఓటర్లు 2,02,19,104 వున్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 68,182 మంది వున్నట్లు ఈసీ పేర్కొంది.