నేపాల్ లో భూకంపం సంభవించింది. దీంతో ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. నేపాల్ లో భూకంపం కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీలోని నోయిడా, గుడ్ గావ్ లో 10 సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే.. మంగళవారం రాత్రి కూడా నేపాల్ లో భూమి కంపించింది. 4.9 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు పేర్కొన్నారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

రంగంలోకి దిగిన ఆర్మీ సహాయక చర్యలు చేపడుతోంది. నేపాల్ దోతి జిల్లాలో మంగళవారం సైతం 4.5 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం కారణంగా ఆరుగురు చనిపోవడంపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు ట్వీట్ చేశారు.












