జమ్మూ కశ్మీర్ విషయంలో అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని ప్రతి కుటుంబాన్ని గుర్తించేందుకు ఓ ప్రత్యేక కార్డును జారీ చేయనున్నారు. ఆ కార్డులో ప్రత్యేకమైన ఆల్ఫా న్యూమరిక్ కోడ్ వుంటుంది. ఈ మేరకు అక్కడి యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సులభంగా అందించడానికే దీనిని అమలులోకి తెస్తున్నట్లు వివరించారు. తమకు వచ్చిన డేటాబేస్ ను సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగిస్తామని అక్కడి అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది. ఓ సారి కార్డు జారీ చేసిన తర్వాత… ప్రభుత్వ సేవలకు పౌరులు మరోసారి విడివిడిగా ధ్రువ పత్రాలను సమర్పించాల్సిన అవసరమే లేదని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రిందటే జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హర్యానా సీఎ ఖట్టర్ కలిసి డిజిటల్ జేకే విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు.












