విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్ రైల్ ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయి, గాయాలైన విద్యార్థిని శశికళ (20) మరణించింది. అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం జరగడంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు శ్రమించినా… లాభం లేకపోయింది. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె మరణించింది. అన్నవరానికి చెందిన శశికళ… దువ్వాడలోని కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. కాలేజీకి వెళ్లేందుకు గుంటూరు- రాయగడ ఎక్స్ ప్రెస్ లో ఎక్కి, దువ్వాడకు చేరుకుంది. రైలు దిగుతున్న సమయంలో ప్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు… అక్కడికి చేరుకున్నారు. గంటన్నర పాటు శ్రమించి… ఆమెను బయటికి తీసి, ఆస్పత్రికి తరలించారు. ఆమెను బతికించేందుకు వైద్యులు శ్రమించారు. కానీ… లాభం లేకపోయింది. చివరికి శశికళ మరణించింది.












