యూపీ ఝాన్సీ ప్రాంతంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విషాదం జరిగింది. ప్రతి యేటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్ సైజ్ లో ప్రమాదం జరిగింది. జవాన్లు విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలిపోయింది. దీంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై మిలటరీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందిన వెంటనే సైనిక ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సైన్యం చాలా సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా ఈ కేసుపై తన స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.