బాలకృష్ణతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయన అంకితభావం, నటనలో ఆయన ఎనర్జీ గొప్పగా ఉంది. అని దునియా విజయ్ అన్నాడు. ఈ కన్నడ నటుడు బాలయ్య బాబు సినిమా వీరసింహారెడ్డిలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో నటుడిగా తన స్థాయి మరింత పెరుగుతుందని అనుకుంటున్నానని అన్నాడు. తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నాననని తెలిపాడు. ఈ నెల 12న వీరసింహారెడ్డి విడుదల కానుంది. ఈ సందర్భంగా దునియా విజయ్ పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ చిత్రంలో నా పాత్ర గురించి చెప్పగానే చాలా థ్రిల్‌గా అనిపించింది. బాలకృష్ణ సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి. సినిమాకు ఒక పిల్లర్‌లా ఆ పాత్ర ఉంటుంది. అని వెల్లడించాడు.













