లాంఛనంగా “దుమారం” సినిమా షూటింగ్ ప్రారంభం

మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్ హీరో హీరోయన్లుగా నటిస్తున్న సినిమా “దుమారం”. ఈ సినిమాలో సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జీఎల్బీ సినిమా బ్యానర్ పై జీఎల్బీ శ్రీనివాస్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ – నాయి బ్రహ్మణుల జీవితాల నేపథ్యంతో సాగే చిత్రమిది. పూర్తి కమర్షియల్ అంశాలతో సాగుతుంది. ఇవాళ షూటింగ్ లాంఛనంగా ప్రారంభించాం. సోమవారం నుంచి కొమురవెళ్లిలో చిత్రీకరణ కొనసాగిస్తాం. వచ్చే నెల నుంచి కొత్త షెడ్యూల్ ఉంటుంది. హీరో తండ్రి పాత్రలో సుమన్ గారు నటిస్తున్నారు. ఆయనతో నేను చేస్తున్న మూడో చిత్రమిది. అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. అన్నారు.

సుమన్ మాట్లాడుతూ – జీఎల్బీ శ్రీనివాస్ తో నాకు మంచి స్నేహం ఉంది. ఆయనతో నాకు ఇది మూడో సినిమా. నాయి బ్రాహ్మణుల జీవితాలు, ఈ వృత్తిలో వారు పడుతున్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అయితే డాక్యుమెంటరీలా కాకుండూ పూర్తి కమర్షియల్ గా ఉంటుంది. నేను ఇందులో బార్బర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం అందంగా ఉంటున్నామంటే కారణం వాళ్లే. మంచి ఎంటర్ టైన్ మెంట్, సందేశం అన్నీ కథలో ఉన్నాయి. అన్నారు.

హీరో మల్లిక్ బాబు మాట్లాడుతూ – మాది ఖమ్మం జిల్లా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. హైదరాబాద్ లో ఉద్యోగం చేసేవాడిని. లాక్ డౌన్ లో జాబ్ వదిలేసి ఇక యాక్టింగ్ మీద దృష్టి పెట్టాలని అనుకున్నా. జీఎల్బీ శ్రీనివాస్ గారు నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. తొలి చిత్రంలోనే మాస్ క్యారెక్టర్ దొరకడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ ఇషా మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఒక మంచి మూవీతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నా. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అని చెప్పింది.

కో ప్రొడ్యూసర్ తిరుపతి రాజు మాట్లాడుతూ – ధుమారం సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే ఇందులో విలన్ కొడుకు క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ట్రైనింగ్ ఇప్పించారు. మంచి మూవీ అవుతుంది. అన్నారు.

విలన్ పాండు గౌడ్ మాట్లాడుతూ – నేను సినిమా అభిమానిని. ఏడాదిలో 300 రోజులు సినిమాలు చూస్తూనేే ఉంటా. ఈ చిత్రంతో విలన్ గా పరిచయం అవడం సంతోషంగా ఉంది. సుమన్ గారితో కలిసి సినిమాలో నటిస్తానని అనుకోలేదు. అన్నారు.

నటీనటులు : మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్, రాజు బి యాదవ్, లక్ష్మీ రావు హైమావతి , ఎంసుబ్బరాజు . కేఎస్ దేవి , నరసింహ , నవల్ కిషోర్ అగర్వాల్ .మహేష్ గూడుగుంట్ల , , మల్లాది శాస్త్రి తదితరులు

సాంకేతిక నిపుణులు : కథ -నిర్మాత –దర్శకత్వం: జి ఎల్ బి శ్రీనివాస్, స్క్రీన్ ప్లే మాటలు..ఎన్ ఎన్ రాజు , ఎడిటర్.. సునీల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజు బి యాదవ్ , నిర్మాణ- నిర్వహణ : కొండపాక కనకయ్య , కెమెరా- టి సురేందర్ రెడ్డి.

Related Posts

Latest News Updates