మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే చేసిన కథతో “డ్రింకర్ సాయి” సినిమా రూపొందించాం – ట్రైలర్ లాంఛ్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాకు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ మూవీ ఇది. ఈ నెల 27న థియేటర్స్ కు వెళ్లి తప్పకుండా చూడండి. మీరంతా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా కథను ఎంతబాగా చెప్పారో అంతకంటే బాగా రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఈ సినిమాను బాగా తెరకెక్కించడం కోసం టీమ్ లోని ప్రతి ఒక్కరూ శ్రమించారు. చంద్రబోస్ గారు ఆరు పాటలను అద్భుతంగా రాశారు. అవన్నీ కథను మరింత ఎలివేట్ చేసేలా ఉంటాయి. ధర్మ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. అడిగి మరీ రీటేక్స్ చేసేవాడు. “డ్రింకర్ సాయి” వంటి ఒక మంచి మూవీతో మీ ముందుకు ఈ నెల 27న వస్తున్నాం. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నిర్మాత లహరిధర్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందో సినిమాలోనూ అలాంటి కంటెంట్ చూస్తారు. థియేటర్స్ లో మా మూవీని ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ కు బాగా నచ్చేలా సినిమా ఉంటుంది. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నటి కిర్రాక్ సీత మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాలో ఒక మంచి రోల్ లో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కిరణ్ గారికి థ్యాంక్స్. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కు భిన్నమైన రోల్ ఈ చిత్రంలో చేశాను. హీరో ధర్మ, హీరోయిన్ ఐశ్వర్య..ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేశారు. అన్నారు.

డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ వాళ్ల నాన్నగారు శ్రీనివాస్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మిత్రులు. నేను ఈ కథను శ్రీనివాస్ గారికి చెప్పినప్పుడు చిరంజీవికి చెబుదాం ఆయన ఒపీనియన్ తీసుకుందాం అన్నారు. అప్పుడు నేను కథలో సోషల్ ఎలిమెంట్ యాడ్ చేస్తూ రీ రైట్ చేశాను. ఆ తర్వాత “డ్రింకర్ సాయి” కథ చాలా బాగుందని జీకే మోహన్ గారు చిరంజీవి గారికి మెసేజ్ పంపిస్తే ఆయన ఓకే అని రిప్లై ఇచ్చారు. అలా మెగాస్టార్ గారి అంగీకారంతో “డ్రింకర్ సాయి” సినిమా మొదలైంది. ఆయన నో చెప్పి ఉంటే ఈ సినిమా ఉండేది కాదు. ధర్మ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. సత్యానంద్ గారి దగ్గరి శిక్షణ తీసుకున్న వాళ్లలో ప్రభాస్ తర్వాత ధర్మ పేరే చెబుతారు. ఈ సినిమాకు ధర్మ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. హీరోయిన్ ఐశ్వర్యను చూడగానే నా కథలోని బాగీ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఆమె తెలుగు రాకున్నా అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు, లిరిసిస్ట్ చంద్రబోస్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు వారికి థ్యాంక్స్ చెబుతున్నా. యూత్ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకే కొంత యూత్ ఫుల్ కంటెంట్ పెట్టాల్సివచ్చింది. థియేటర్స్ కు వచ్చాక డెఫనెట్ గా బాగుందని అంటారు. ఈ సినిమా చూశాక ఒక మంచి మూవీ చేశావని మీడియా మిత్రులు తప్పకుండా నన్ను ప్రశంసిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మీ మాట్లాడుతూ – కథలో దమ్ముంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెట్ మా “డ్రింకర్ సాయి” మూవీలో ఉంది. ట్రైలర్ చూసి ఇది ఒక సెక్షన్ ఆడియెన్స్ కోసం అనుకోకండి. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూడొచ్చు. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్ మీ అందరి సమక్షంలో రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్. నాకు తెలుగు రాదు. ముంబై నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సెట్ లో తెలుగు డైలాగ్స్ నేర్చుకునేందుకు ధర్మ హెల్ప్ చేశాడు. అలాంటి మంచి కోస్టార్ దొరికినందుకు హ్యాపీగా ఉంది. కిర్రాక్ సీత నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలాగే టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ నెల 27న “డ్రింకర్ సాయి” సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ధర్మ మాట్లాడుతూ – నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ప్యాషన్. మన స్టార్ హీరోస్ సినిమాల పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. “డ్రింకర్ సాయి” సినిమాలో అవకాశం వచ్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. మా మూవీ ట్రైలర్ చూసి నన్ను కొంతమంది తిడుతున్నారు. కానీ సినిమా చూస్తే ఒక్కరు కూడా తిట్టరు. డ్రింకర్ సాయి మీకు నచ్చుతాడని బల్లగుద్ది చెబుతున్నా. మేము కొంతమంది పెద్ద వయసు వాళ్లకు షో వేశాం. వాళ్లలో వందకు వంద మంది ఎక్కడా ఇబ్బంది పడలేదు. సినిమా బాగుందన్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కు, ఆటో డ్రైవర్స్, తాపీ మేస్త్రి వాళ్లకు షో వేశాం. అందరి నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మా టీమ్ లో ఎవరూ డబ్బుల కోసం పనిచేయలేదు. ప్యాషన్ తో వర్క్ చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే మా హీరోయిన్ ఐశ్వర్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. కిరాక్ సీత ఒకే టేక్ లో సీన్స్ చేసేది. శ్రీ వసంత్ మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతమంచి మూవీ నాకు ఇచ్చినందుకు మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్