‘డ్రీమ్ క్యాచర్’ సినిమా సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సందీప్ కాకుల

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ ప్రణీత్ గౌతమ్ నందా మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్. ట్రైలర్ చూశారు కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. జనవరి 3న మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ట్రైలర్ మ్యూజిక్ చేసిన వెంకటేష్ మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాలో ర్యాప్ సాంగ్ చేయాలన్న ఆలోచన సందీప్ ఇచ్చాడు. ఈ పాటకే కాదు మొత్తం సినిమా అంతా చాలా ఫ్రీడమ్ ఇచ్చి తన టెక్నీషియన్స్ తో వర్క్ చేయించుకున్నారు. ఎడిటింగ్ టైమ్ లో ఈ సినిమాను వందసార్లు చూశాను. ప్రతిసారీ కొత్తగా అనిపించింది. ఆర్టిస్టులు ప్రశాంత్, అనీషా, శ్రీనివాస్ బాగా నటించారు. అన్నారు.

ట్రైలర్ మ్యూజిక్ చేసిన సిద్ధార్థ్ కాకుల మాట్లాడుతూ – ట్రైలర్ లో ఒక మంచి బీట్ తో లౌడ్ గా మ్యూజిక్ వినిపించే సాంగ్ కావాలని సందీప్ అడిగాడు. అలా ఈ ర్యాప్ సాంగ్ చేశాం. ఈ పాట మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. అన్నారు.

యాక్టర్ నాగరాజు మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’సినిమాలో నిఖిల్ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్. జనవరి 3న మీరంతా థియేటర్స్ కు వచ్చి తప్పకుండా మూవీ చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్ చేశాను. మనమంతా జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ లో స్ట్రక్ అయి పోయి ఉంటాం. ఆ ఘటన జరిగినప్పుడు మనసులో ఒక సంఘర్షణ మొదలవుతుంది. అలా తన జీవితంలో జరిగిన ఓ ఘటన ప్రభావం నుంచి బయటపడేందుకు హీరో ఎలా ప్రయత్నించాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా మా దర్శకుడు సందీప్ తెరకెక్కించాడు. ఆయన ప్రతి ఫ్రేమ్ ను డీటెయిల్డ్ గా తెరకెక్కించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎడిటింగ్ లో అనేక వెర్షన్స్ చేశాడు. ఇలాంటి పర్పెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

యాక్ట్రెస్ అచ్యస సిన్హా మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ లాంటి గొప్ప చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ప్రతి ఆర్టిస్ట్ ఎంతో బాగా నటించారు. మా టీమ్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. జనవరి 3న థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాను. అన్నారు.

హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ – నాలుగేళ్ల కిందట సందీప్ ‘డ్రీమ్ క్యాచర్’సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే కారణంగా మా సందీప్. టీమ్ లోని ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్తూ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. ట్రైలర్ చూశాక నేను అడివిశేష్, రానా లా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లు గొప్ప యాక్టర్స్, సెల్ఫ్ మేడ్ స్టార్స్. అలాంటి టాలెంటెడ్ ప్యాషనేట్ యాక్టర్స్ తో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మిమ్మల్ని డెఫనెట్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు.

డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ – సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. ఇన్ సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఇన్సిపిరేషన్ గా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను. మనకున్న రిసోర్సెస్ లో మొత్తం హైదరాబాద్ లోనే సినిమా రూపొందించాను. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. మేము ఎక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్ లోనే షూట్ చేశాం. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు ఫైట్స్ ఉండవు. అవి లేకుండా కేవలం కథ మీదనే మూవీ వెళ్తుంది. ఇది థియేటర్, ఓటీటీ కి వెళ్తుందా అని అనుకోలేదు. ఒక మంచి మూవీ చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను. నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్ లో ప్రమోషన్ చేస్తున్నాం. మాకున్న టైమ్ లో సినిమాను ఆడియెన్ కు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

నటీనటులు – ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, నాగరాజు, తదితరులు

Related Posts

Latest News Updates