2019 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తరఫున పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేసి దాదాపు 16,700 సాధించినారు బోడె రామచంద్ర యాదవ్. రాజకీయ దిగ్గజమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పోటీచేసి ఓడిపోయిన రామచంద్ర యాదవ్ తన గెలుపోవటములతో సంబంధం లేకుండా అప్పటినుండి పుంగనూరు నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన తలపెట్టిన జాబ్ మేళా, రైతు భేరి, మహిళా భేరి తదితర కార్యక్రమాలను అనేక కారణాలు చూపి లోకల్ వైసిపి నాయకులు అడ్డుపడుతూ వస్తున్నారు. ఈ చర్యలను రామచంద్ర యాదవ్ ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎలాగైనా రామచంద్ర యాదవ్ ను భయపెట్టి రాజకీయాల నుండి దూరం చేయాలనే తలంపుతో పెద్దిరెడ్డి అనుచరులు దాదాపు 200 మంది గత డిసెంబర్ నెలలో రామచంద్ర యాదవ్ కట్టుకున్న నూతన గృహాన్ని మరియు అతని కార్లను ధ్వంసం చేయటమే గాక అతనిపై హత్యా ప్రయత్నం కూడా చేశారు.
ఇంత అన్యాయం జరిగినా పోలీసు వారు దుండగలపై కేసులు పెట్టలేదు, ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను రామచంద్ర యాదవ్ కలిసి తనపై జరిగిన హత్య ప్రయత్నం గురించి వివరించి తనకు కేంద్ర బలగాలను రక్షణగా పంపవలసిందిగా కోరారు. దీనిపై వెంటనే స్పందించిన అమిత్ షా రామచంద్ర యాదవ్ కు శనివారం నాడు వై ప్లస్ భద్రతను కలిగించాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర హోం శాఖ తీసుకున్న చర్యలపై స్పందించిన ద్రావిడ దేశం అధ్యక్షుడు వి .కృష్ణారావు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా ను అభినందిస్తూ ఓ బి సి వర్గాలపై ముఖ్యంగా యాదవులపై జరుగుతున్న అన్యాయాలపై వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రిని అభినందిస్తూ ద్రావిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు ట్విట్టర్లో సందేశాన్ని పంపారు. ఇకమీదట బడుగు బలహీన వర్గాల వారిపై జరుగుతున్న అన్యాయాలను ద్రావిడ దేశం చూస్తూ ఊరుకోదని పోరాటాలకు సైతం సిద్ధపడతామని కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.












