హర్యానా సీఎం నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ సింధూజ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ డీఎస్వీ సింధూజ బీడీఎస్‌లో బంగారు పతకాన్ని సాధించింది. సింధూజ హర్యానా ఫరీదాబాద్‌లోని మానవ్ రచన డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. రోహ్‌తక్‌లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేతుల మీదుగా సింధూజ గోల్డ్ మెడల్ అందుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమెను అభినందించారు. సింధూజ విజయం తెలుగు వారందరికీ గర్నకారణమని కొనియాడారు. వేలాది మంది విద్యార్థులతో పోటీపడి సింధూజ బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సూధాకర్‌రావు సుప్రీంకోర్టులో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె డీఎస్వీ సింధూజ.

Related Posts

Latest News Updates