ఉద్యోగులపై ట్విట్టర్‌ వేటు.. ఈసారి

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3400 మందికిపైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ తాజాగా ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లో మరికొందరిపై వేటువేసింది. డబ్లిన్‌, సింగపూర్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు డజను మందికిపైగా ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నది. తమ టీమ్‌లో కొందరని తొలగించామని, అయితే సేఫ్టీ కంటెంట్‌ నియంత్రణలో వేలాది మంది పనిచేస్తున్నారని ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్లా ఇర్విన్‌ చెప్పారు. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. కాస్ట్‌ కటింగ్‌, సంస్థ వృద్ధి పేరుతో 3600 మంది ఉద్యోగులను తొలగించారు. వీరిలో భారత్‌లో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు.

Related Posts

Latest News Updates