ట్విట్టర్ లోకి డొనాల్డ్ ట్రంప్, కంగనా?

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోకి తిరిగి అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, భారతీయ నటి కంగనా రనౌత్‌లు యుజర్లుగా చేరే అవకాశాలు ఉన్నాయి. విద్వేషపు అంశాల కారణంగా ట్రంప్, కంగనా ఇతర ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై ఇప్పటివరకూ నిషేధం అమలులో ఉంది.   ఏ కారణం చేతనైనా ట్విట్టర్ వాడకం శాశ్వత నిషేధం ఎవరిపైనా ఉండబోదని కొత్తగా ట్విట్టర్ సారధ్య బాధ్యతలు స్వీకరించిన మస్క్ తెలిపారు. ఘోరమైన సైబర్ నేరాలకు తప్పిదాలకు పాల్పడే వారి ఖాతాలపై తప్ప ఇతరత్రా ఎవరిపైనా పూర్తిస్థాయి నిషేధం ఉండబోదని మస్క్ స్పష్టం చేశారు. అయితే తాను తిరిగి ట్విట్టర్ యుజర్‌గా చేరే అవకాశం ఉందని తాజాగా కంగనా రనౌత్ తెలిపారు. ఇప్పటికే ట్విట్టర్ ఖాతా వాడకందారుడిగా తిరిగి రావాలని ట్రంప్‌ను మస్క్ కోరారు. దీనిపై ట్రంప్ స్పందించలేదు.

Related Posts

Latest News Updates