మన దేశంలో ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ మూవీలు వచ్చాయి కానీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న రాజమౌళి- మహేష్ బాబు సినిమానే అన్నింటికంటే బడ్జెట్ పరంగా బిగ్గెస్ట్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి, ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీర్చిదిద్దబోతున్నాడు.
ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఊరిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ తలమునకలై ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడందరికీ ఈ చిత్ర నిర్మాణ సంస్థపై ఓ డౌట్ కలుగుతుంది. దుర్గా ఆర్ట్స్ సంస్థ చాలా ఏళ్లుగా ప్రొడక్షన్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇంత భారీ బడ్జెట్ సినిమాను వాళ్లు డీల్ చేయగలరా అని అందరూ అనుమాన పడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, నిర్మాత నారాయణ అండ్ టీమ్ ఈ సినిమాను నిర్మించే విషయంలో ఏ అనుమానాలు పెట్టుకోనక్కర్లేదని, ఆయన టీమ్ స్టోరీ డిస్కషన్స్ లో, ప్రీ ప్రొడక్షన్ లో పాల్గొంటుందని తెలిసింది. దుర్గా ఆర్ట్స్ లో పార్టనర్ అయిన గోపాల్ రెడ్డి, తాజాగా ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. తాను కూడా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నానని, తనకు కూడా సినిమా కథ తెలుసని వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రస్తుతం గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ స్పెషల్ సెట్ కూడా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.