ఆరెస్సెస్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన తమిళనాడు ప్రభుత్వం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అక్టోబర్ 2 న తలపెట్టిన రూట్ మార్చ్ కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ ర్యాలీ ద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని, కొన్ని గ్రూపులు రూట్ మార్చ్ సందర్భంగా ఇబ్బందులు చేసేందుకు రెడీగా వున్నాయని, అందుకే రూట్ మార్చ్ వద్దని సూచించిందని ఓ ఆరెస్సెస్ నేత పేర్కొన్నారు. అయితే తాము శాంతియుతంగానే ర్యాలీ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తమకు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, న్యాయపరంగానే తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక.. విడుతలై చిరుత్తైగల్ కట్చి తలపెట్టిన కార్యక్రమానికి కూడా అనుమతి లేదని ప్రభుత్వం తెలిపింది.

 

నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రదేశాల్లో గాంధీజీ జయంతి సందర్భంగా రూట్ మార్చ్ నిర్వహించాలని సంఘ్ నిర్ణయించింది. అయితే శాంతిభద్రతల కోణంలో ఈ రూట్ మార్చ్ కు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆరెస్సెస్ కి కౌంటర్ గా అదే రోజు తాము కూడా హ్యుమన్ చైన్ నిర్వహిస్తామని విడుతలై చిరుత్తైగల్ కట్చితో పాటు వామపక్షాలు కూడా ప్రకటించాయి.

Related Posts

Latest News Updates