తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా మ్యూజియన్స్ కి HEALTH-CARDS వితరణ

తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులకు మైక్రోకేర్ మరియు నేత్ర హాస్పిటల్ వారి సౌజన్యం తో
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారి ఆద్వర్యంలో ప్రారంభమైన ఈ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనంతరం … తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ కె. రాకేష్ ( నాని) ప్రధాన కార్యదర్శి శ్రీ పుట్ట విజయ్ కుమార్. కోశాధికారి శ్రీ కె. నరేందర్ రెడ్డి గార్లు మరియు ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఆర్. పి . పట్నాయక్ గారు మరియు తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్

యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ. యస్.ఏ.ఖుద్దూస్ ప్రధాన కార్యదర్శి శ్రీ గాడిచర్ల బంటి, కోశాధికారి శ్రీ ఉదయ్ కుమార గార్లు కొనసాగించగా.. టివి మ్యూజియన్స్ యూనియన్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో టివి & ఓటిటి మ్యూజియన్స్ సభ్యులకు ENT మరియు EYE హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది..మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 4 సంవత్సరాలకు వర్తించేలా ఇచ్చిన ఈ హెల్త్ కార్డ్స్ చాలా గొప్పవని వక్తలు అభిప్రాయ పడ్డారు.సుమారు 100 మంది మ్యూజియన్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కె.యల్. స్టూడియోస్ అధినేత శ్రీ లక్ష్మణ్ గౌడ్ గారి ఆద్వర్యంలో అతిథులందరికీ బోజన సదుపాయం కల్పించడం జరిగింది.. ఈ మైక్రోకేర్ మరియు నేత్ర హాస్పిటల్ వారి హాస్పిటల్ సేవలు మా ఫెడరేషన్ అన్ని అనుబంధ సంఘాల వారు ఉపయోగించుకునేలా చర్యలు చేపడతామని టివి & డిజిటల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ కె.రాకేష్ ( నాని) గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు.

Related Posts

Latest News Updates