చిత్ర పరిశ్రమలో విషాదం… దర్శకుడు సాగర్ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సాగర్ (70) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. సాగర్ స్వస్థలం గుంటూరు జిల్లా.దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, అన్వేషణ లాంటి సినిమాలను సాగర్ తీశారు. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.

Related Posts

Latest News Updates