డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మళ్లీ మెగా బ్రదర్స్ ని టార్గెట్ చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబును ఉద్దేశిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. నాగబాబు ఆయన తమ్ముడికి లేదా అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యి వుండవచ్చు. నాకు కాదు… నేను జనసేన మీద కానీ పవన్ మీద కానీ చేసిన కామెంట్స్ పవన్ అభిమానిగా మాత్రమే చేశాను. అది అర్థం కాకపోవడం నా దురదృష్టం.. తన కన్నా ఎక్కువ పవన్ దురదృష్టమని” అన్నాడు. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టే నాగబాబును సలహాదారుడిగా పెట్టుకుంటే తర్వాత ఎలాంటి ఫలితాలుంటాయో ప్రజలే చెబుతారని వర్మ చెప్పారు. పవన్ కళ్యాణ్ కొంచెం మీ అన్నయ్యను కూడా చూసుకోండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023