‘రంగమార్తాండ’ లో మెగాస్టార్ షాయరీ… జబర్దస్త్ అప్ డేట్ ఇచ్చిన కృష్ణవంశీ

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’. అయితే.. దీనికి సంబంధించిన ఓ జబర్దస్త్ అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్‌ చిరంజీవి షాయరీ (కవితాఝరి) అందించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ ప్రకటించారు. “స్నేహితులు, శ్రేయోభిలాషులకు హాయ్‌.. చాలా కాలంగా ఉన్న ఎదురుచూపులకు శుభం పడనుంది. గర్వంగా సమర్పిస్తున్నా.. నా సినిమా రంగమార్తాండ కోసం అన్నయ్య షాయరీ.. మీరంతా ఇష్టపడతారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. అంతేకాదు దీనికి సంబంధించిన చిరు కవితాఝరి పలుకుతున్న స్టిల్‌ను కూడా షేర్ చేశాడు. నేనొక నటుడిని అంటూ సాగే షాయరీని డిసెంబర్‌ 21న ఉదయం 11 : 07 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు కృష్ణవంశీ ప్రకటించాడు.

Related Posts

Latest News Updates