జూనియర్ ఎన్టీఆర్ బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ హాజరయ్యాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను. ముఖ్యంగా జేమ్స్, ఎమిలీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన మంచి మాటలకు, పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివతో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్లు హాజరయ్యారు.
ఆర్ఆర్ఆర్’చిత్రంతో ఎన్టీఆర్‌కు సినిమాకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆర్ఆర్ఆర్లో ఆయన పోషించిన కొమురం భీమ్ పాత్రలో ఆయన అభినయానికి ఎంతోమంది అభిమానులు అయ్యారు. తాజా అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ తారక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిసింది. ఆయన్ను కలవడం కోసమే అమెరికా నుంచి ఆయన వచ్చారు.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq
— Jr NTR (@tarak9999) April 12, 2023













