తెలుగు వారసుడు రిలీజ్ వాయిదా… ఎప్పుడో ప్రకటించిన దిల్ రాజు

దళపతి విజయ్ నటించిన సినిమా తెలుగు వర్షన్ ”వారసుడు” రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. వారసుడు తెలుగు వర్షన్ మూవీ విడుదల వాయిదా పడిందని ప్రకటించారు. తమిళంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 11 నే రిలీజ్ అవుతుందని, తెలుగు వర్షన్ మాత్రం ఈ నెల 14 న విడుదల అవుతుందని తెలిపారు. టాలీవుడ్ పెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే… ఇందులో తనకు ఎలాంటి బాధా లేదన్నాడు. ఈ సినిమాపై తనకు 100 శాతం హోప్స్ వున్నాయన్నాడు. గతంలో తమ బ్యానర్ కింద వచ్చిన సినిమాలు ఎలా హిట్ అయ్యాయో… వారసుడు కూడా అలాగే హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

Related Posts

Latest News Updates