కోలివుడ్ స్టార్ విజయ్ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోలివుడ్ స్టార్ హీరో విజయ్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. విజయ్ మంచి మనసున్న మనిషని, స్క్రీన్ పైనే కాదు.. నిజ జీవితంలోనూ సూపర్ డూపర్ స్టారేనని దిల్ రాజు అన్నాడు. ఎదుటి వారితో గౌరవంగా వుంటాడనని తెలిపాడు. వారిసు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఈ కామెంట్స్ చేశాడు. తాను తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేశానని, విజయ్ తో కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని అన్నాడు. ఓ సారి చెన్నైకి వెళ్లి ఆయన్ని కలిశానని, అప్పుడు విజయే ఛాయ్ తీసుకొని వచ్చాడని దిల్ రాజు వెల్లడించాడు. అప్పుడు షాక్ కు గురయ్యానని, ఆయన ఇచ్చిన గౌరవం చూసి షాకయ్యానని అన్నాడు. వారిసు చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల అవుతోంది. రష్మిక హీరోయిన్ గా, జయసుధ, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ మూవీల వుంటున్నారు.

Related Posts

Latest News Updates