తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేగడంతో అధిష్ఠానం దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ లో బస చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ కు పీసీసీ ప్రొటోకాల్ ఇన్ చార్జ్ హర్కర వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్​కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. దిగ్విజయ్ హోటల్​కు రాగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు.

 

ఈ సందర్భంగా ఆయన పార్టీ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పీఏసీ ( పొలిటికల్ అఫైర్స్ కమిటీ ) మీటింగ్​లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతారని పార్టీ నేతలు తెలిపారు. ఈ రోజు ఉదయం గాంధీభవన్ లోనే దిగ్విజయ్ సింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వుండనున్నారు. అసంతృప్తులతో భేటీ అయి…. వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు.