తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా అవార్డ్స్-2022లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో ఏర్పాటైన వ్యవసాయ రంగ ప్రాజెక్ట్ స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్కు గోల్డ్ ఐకాన్ పురస్కారం లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి, ఐటీ శాఖ సీనియర్ కన్సల్టెంట్ సుధీర్ కుమార్ ఈ అవార్డు అందుకున్నారు. మొత్తం 7 కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేయగా, ప్రతి కేటగిరీలో మొదటిస్థానంలో నిలిచినవారికి ప్లాటినం, 2వ స్థానంలో నిలిచినవారికి గోల్డ్, 3వ స్థానంలో నిలిచినవారికి సిల్వర్ అవార్డులను అందజేశారు. ఇందులో ాడిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టార్టప్స్్ణ కేటగిరీలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచి గోల్డ్ అవార్డు అందుకుంది. ాస్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సాయిల్్ణ పేరుతో చేపట్టిన కార్యక్రమం ఈ అవార్డుకు ఎంపికైంది.