‘దూత’ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: నిర్మాత శరత్ మరార్

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మ్యాసివ్ బ్లాక్ బస్టర్ ‘దూత’ వెబ్ సిరిస్ తో చాలా గ్రాండ్ గా ఓటీటీ అరంగేట్రం చేశారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరిస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  డిసెంబర్ 1 నుంచి  ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారమైన ‘దూత’ వెబ్ సిరిస్ యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో బిగ్గెస్ట్ ఓటీటీ హిట్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత శరత్ మరార్ ‘దూత’ విశేషాలని విలేకరులతో పంచుకున్నారు.

‘దూత’ తో ఓటీటీలో మాసీవ్ బ్లాక్ బస్టర్ సాధించారు .. ఎలా అనిపిస్తోంది ?
చాలా ఆనందంగా వుంది. ఈ ప్రాజెక్ట్ ని జూన్ జులై లోనే పూర్తి చేసి ఫైనల్ కాపీ అమేజాన్ కి ఇచ్చాం. అయితే ఇచ్చిన తర్వాత  ఎన్నో భాషల్లో డబ్, సబ్ టైటిల్స్ చేసి తర్వాత విడుదల చేస్తామని ముందే వివరించారు. ఆ ప్రక్రియకి దాదాపు ఐదు నెలలు సమయం తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా మాకు కొత్తగా అనిపించింది. అయితే విడుదలైన తర్వాత అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన  వచ్చింది. మంచి ప్రోడక్ట్ చేశామని తెలుసు. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. నాగచైతన్య, విక్రమ్.. టీం అంతా రిజల్ట్ పై చాలా ఆనందంగా ఉన్నాము. లాంగ్ ఫార్మట్ స్టొరీ టెల్లింగ్ అనేది ఇండియాలో కొత్త ఫార్మాట్. కొన్ని సిరిస్ లు వచ్చినప్పటికీ ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే. ఈ క్రమంలో చేసిన ప్రాజెక్ట్ కు  ప్రేక్షకులు నుంచి ఇంత మంచి స్పందన రావడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.

విక్రమ్ కుమార్ గారు ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏమిటి ?
‘దూత’ ఆలోచన, కాన్సప్ట్ చాలా నచ్చింది. విక్రమ్ కుమార్ గారు అద్భుతమైన కథకుడు. తను కథ చెబుతున్నపుడు ఆ ప్రపంచంలో మనల్ని హోల్డ్ చేస్తారు. ఆ కథతో పాటు మనల్ని తీసుకెళ్ళే సామర్ధ్యం ఆయనకి వుంది. దూత కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంటుందని ముందే తెలుసు. అయితే ఆలోచనని ఎనిమిది ఎపిసోడ్స్ గా ఎలా మలుస్తారనే క్యురియాసిటీ వుండేది. కొన్ని నెలలు తర్వాత ఎపిసోడ్స్ వారీగా కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. తర్వాత అమెజాన్ వాళ్ళు పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ గా వచ్చారు. గొప్పగా సపోర్ట్ చేశారు. క్రియేటివ్ గా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.

నాగచైతన్య గారికి ఇది తొలి వెబ్ సిరిస్ కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ?
ఈ విషయంలో నాగచైతన్య గారిపై మాకు గొప్ప గౌరవం వుంది. వెబ్ చేయాలా వద్దా అనే అలోచిస్తున్న తరుణంలో నాగచైతన్య గారు ఈ కథ వినగానే చేద్దామని ముందుకు వచ్చారు. ‘ఈ ఫార్మాట్ ని ఎక్స్ ఫ్లోర్ చేయాలని వుంది. డిఫరెంట్ కథలు చేయడానికి ఫ్రీడమ్ దొరుకుతుంది’ అని చెప్పారు. అది మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

ఈ కథని నాగచైతన్య గారితో చేయడానికి కారణం ?
విక్రమ్ కథ చెప్పినప్పుడే ఈ కథకు నాగచైతన్య లాంటి సెన్సిబిలిటీస్ వున్న లీడింగ్ యాక్టర్ అయితే బావుంటుందని అనుకున్నారు. అది మా అందరికీ కరెక్ట్ అనిపిచింది. ఈ సిరిస్ లో ప్రతి పాత్రకు సంబధించిన నటీనటులు ఎంపిక దర్శకుడు విక్రమే డిసైడ్ చేశారు.

బ్రహ్మనందం గారి అబ్బాయి గౌతమ్ పాత్ర సర్ ప్రైజ్ గా అనిపించింది.. ఆయన పాత్ర ఎంపిక ఎలా జరిగింది ?
దర్శకుడు విక్రమ్ అందరి నటీనటులు ప్రివియస్  వర్క్ ని చూసి చాలా పర్టిక్యులర్ గా నటులని ఎంపిక చేశారు. ఆ పాత్రకు గౌతం అయితే బావుంటుదని అనుకున్నారు. గౌతమ్ చాలా చక్కగా నటించాడు. ఇంతమంది ఆర్టిస్టుల మధ్య తన మార్క్ ని చూపించారు. అలాగే రవీంద్ర విజయ్ కూడా తన పాత్రని చక్కగా చేశారు.
ప్రధాన తారాగణం నాగచైతన్య గారు, ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ ఇలా అందరూ తమ అద్భుతమైన నటనతో సిరిస్ కు కొత్త ఫ్లావర్ యాడ్ చేశారు.

సినిమాలతో పోల్చుకుంటే మీరు చేసిన వెబ్ ప్రాజెక్ట్స్ కు మంచి ఫలితాలు వచ్చాయి కదా ?
నేను ఎప్పుడూ కంపేర్ చేసుకోలేదు. నేను టెలివిజన్ తో మొదలుపెట్టాను. తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది. కళ్యాణ్ గారు వరుసగా సినిమాలు ఇచ్చారు. కళ్యాణ్ గారి వలనే నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పుట్టింది. వెబ్ అనేది ఫ్యూచర్ అని మనకి తెలుస్తుంది. అందులోకి త్వరగా వెళితేనే అందులో వున్న ఉన్న గ్రామర్ అర్ధమౌతుంది. అందుకే ముందుగానే అందులోకి ఎంటరయ్యం. ఈ క్రమంలో ది గ్రిల్, సిన్, ఎక్సపైరీ డేట్, గాలివాన సిరిస్ లు చేశాం. ఇప్పుడు దూత తో బిగ్ సక్సెస్ రావడం ఆనందంగా వుంది. సినిమాలపై కూడా ఫోకస్ వుంది. కథలపై వర్క్ చేస్తున్నాం. సినిమాలు, ఓటీటీ  రెండిటిని చేస్తాం.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో ‘దూత’ని ప్రిమియర్ చేయడం ఎలా అనిపించింది ?
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో ‘దూత’లోని ఒక ఎపిసోడ్ ని ప్రదర్శించాం. మా టీం అందరికీ ఇది చాలా వండర్ ఫుల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్.

‘దూత’ సక్సెస్ పై నాగచైతన్య గారు ఎలా స్పందించారు ?
నాగచైతన్య గారు చాలా ఆనందంగా వున్నారు. 240 దేశాల్లో ఈ సిరిస్ ని విడుదల చేశారు. దాదాపు 38 భాషల్లో సబ్ టైటిల్స్ చేశారు. ఒక నటుడికి గానీ నిర్మాతకు గానీ తమ వర్క్ ఇంత వైడ్ రేంజ్ లో రీచ్ కావడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అమెజాన్ గొప్ప ఫ్లాట్ ఫాం ఇచ్చింది. నాగచైతన్య గారి నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇలాంటి పాత్రలో చైతుని చూడటం చాలా కొత్తగా వుందని ప్రేక్షలులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాగచైతన్య, విక్రమ్ కుమార్.. ఇలాంటి కాంబినేషన్ కుదిరితే సినిమా చేయాలనీ అనుకుంటారు.. మీరు ఈ కాంబినేషన్ తో ఓటీటీ కి చేయాలని ఎలా అనిపించింది ?
ఇదే కాంబినేషన్ తో సినిమా చేయడానికి కూడా ప్రయత్నిస్తాం(నవ్వుతూ)

దాదాపు 100 రోజులు ఈ సిరిస్ ని వర్షంలోనే షూట్ చేశారు కదా.. నిర్మాణం పరంగా ఎలాంటి సవాల్ వచ్చాయి?
విక్రమ్ ఈ కథ చెప్పినప్పటి నుంచి ఇందులో వర్షం కూడా ఒక పాత్రలా ఉంటుందని చెప్పారు. దీనితో సవాళ్ళు వస్తాయని ముందే తెలుసు. వర్షంలో షూట్ చేయడం అంత తేలిక కాదు. అయితే దాన్ని ఒక సవాల్ గా తీసుకోవడం వలన వర్షంతో ఒక క్యారెక్టర్ వచ్చినట్లయింది. విక్రమ్ విజన్ చాలా అద్భుతంగా స్క్రీన్ పైకి వచ్చింది.

సినిమా, వెబ్ సిరిస్ .. ఈ రెండిటిలో ఏది కష్టం ?
దేని ఛాలెంజ్ దానిదే. సినిమాలో హీరో  స్టార్ డమ్ చాలా హెల్ప్ అవుతుంది. స్టార్ పవర్ తో కొంత పట్టుదొరుకుతుంది. వెబ్ సిరిస్ మొదటి నుంచి చివరకూ హోల్డ్ చేసి తీసుకెళ్ళాలి. మొదటి పది నిముషాలు ఆసక్తిగా లేకపోయినా ప్రేక్షకుడు ఛానల్ మార్చేస్తాడు. సో.. దేని కష్టం దానిదే.

పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నారా ?
కళ్యాణ్ గారితో మూడు సినిమాలు చేశాననే గొప్ప ఆనందం వుంది. ఆయనతో మళ్ళీ సినిమా చేసే అవకాశం వస్తే చాలా ఆనందంగా చేస్తాను. ఐతే ఆయన రాజకీయాల్లో బిజీగా వున్నారు. చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. అయితే ఆయనకి నచ్చే కథని, ఆయనకు తగిన కథని తీసుకెళ్ళగలిగితే మాత్రం సినిమా చేస్తారనే నమ్మకం వుంది. ఆయన అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు.

మీ అబ్బాయిని దర్శకుడిగా ఎప్పుడు పరిచయం చేస్తున్నారు ?
తను పర్మిషన్ ఇచ్చినపుడు లాంచ్ చేస్తా(నవ్వుతూ). తను కథ రాయాలి. దానికి కావాల్సిన సమయం తీసుకుంటాడు.

Related Posts

Latest News Updates