శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు ఢీ షో బొనాంజా

బుల్లితెరపై పండుగ ఈవెంట్లు ప్రత్యేకంగా చేయాలంటే అది ఈటీవీ, మల్లెమాల వల్లే సాధ్యం అవుతుంది. ప్రతీ పండుగకు ఏదో ఒక కొత్త ఈవెంట్‌ను నిర్వహిస్తుంటారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ వంటి షోల్లో పండుగలకు అనుగుణంగా స్పెషల్ ఎపిసోడ్స్ నిర్వహిస్తుంటారు. ఇక ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఢీ షోలో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఉండబోతోన్నాయి.

మరీ ముఖ్యంగా సీతారాములు బుల్లితెరపై వచ్చారా? అన్నట్టుగా పర్ఫామెన్స్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ మాత్రమే కాదు.. ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా అవ్వడంతో కంటెస్టెంట్లతో పాటు, ఆడియెన్స్‌‌లోనూ ఉత్కంఠ నెలకొంది.

శ్రీరామ నవమి స్పెషల్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆదర్శ్ అయితే జగడం మూవీలోని వయలెన్స్ ఈజ్ ది ఫ్యాషన్ అనే సాంగ్‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్.. ఆ సాంగ్‌లో డ్యాన్సర్‌గా ఉన్న జానీ మాస్టర్‌ ఇద్దరూ కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేశారు.

రాకీ పర్ఫామెన్స్‌లో సీరత్ కపూర్ మెరిశారు. జానీ మాస్టర్, సీరత్ కపూర్ ఇద్దరూ కలిసి స్టేజ్ మీద తమ్ముడు పాటకు స్టెప్పులు వేశారు.

Related Posts

Latest News Updates