రజినీకాంత్ కూతురు కాపురం హ్యాపీ న్యూస్! రాబోయే కొత్త ఏడాది లో…

తమిళ స్టార్ హీరో ధనుష్ కు ఇచ్చి పెళ్లి చేసిన రజినీకాంత్ కు కూతురు-అల్లుడు విడిపోవడం చూసి చాలా బాధ కలిగింది. వారిద్దరికీ ఎంత సర్ది చెప్పినా కూడా వారం సంసారం నిలబడలేదు. ఇటీవల మరోసారి కలపడానికి ట్రై చేసినా వీలు పడలేదు. ప్రస్తుతం హీరో ధనుష్ ఆయన మాజీ భార్య ఐశ్వర్యలు విడివిడిగానే ఉంటున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు విడాకుల వరకూ దారితీశాయి. జనవరి నుంచే విడివిడిగా ఉంటున్నారు. ఇక ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ జంట విడిపోయినట్టు మళ్లీ కలిసిపోయినట్లు.. రజినీకాంత్ కలిపినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. విడిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. పిల్లల భవిష్యత్ కోసమైనా కలిసి ఉండాలని పెద్దలు రజినీకాంత్ సహా ధనుష్ తండ్రి అయిన దర్శకుడు కస్తూరి రాజా సన్నిహితులు ప్రయత్నాలు చేశారు.  అయితే ధనుష్ ఐశ్వర్య మాత్రం ఇప్పటివరకూ ఈ విషయంలో పెదవి విప్పలేదు. అయితే తాజాగా ఒక వార్త మాత్రం వీరు కలిసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ధనుష్ ఐశ్వర్య కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారని.. దాని కోసమే వారు ఇద్దరూ కలిసి రూ.100 కోట్లతో కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో రూ.100 కోట్లకు పైగా వెచ్చించి ధనుష్ ఓ సువిశాలమైన ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త సంవత్సరంలో గృహ ప్రవేశం జరిగే అవకాశం ఉందట.. ఈ గృహ ప్రవేశాన్ని తన భార్య ఐశ్వర్య పిల్లలతో కలిసి చేయాలని ధనుష్ భావిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇంటిలోనే పాత విభేదాలన్నీ మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఐశ్వర్య ధనుష్ డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటిదాకా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఈ కొత్త 100 కోట్ల ఇల్లు అయినా వీరిద్దరినీ కలుపుతుందా? మళ్లీ కలిసి కాపురం చేస్తారా? అన్నది సస్పెన్స్ వీడాలంటే జనవరి వరకు ఆగాల్సిందే!

Related Posts

Latest News Updates