‘దేవకీ నందన వాసుదేవ’100% మంచి సినిమా. ఐదు నిముషాలు చూస్తేనే థియేటర్స్ కి వెళ్లి చూడాలనే ఫీల్ వచ్చింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్ లుగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా జయదేవ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయనకి సినిమా గురించి తెలియదు అని చెప్పారు. నిజంగా ఆయనకి సినిమా గురించి తెలియదు కానీ వేల కుటుంబాలకి అన్నం పెట్టడం తెలుసు. ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్ లో గొంతు వినిపించడం తెలుసు. ఈరోజు అనుభవిస్తున్న కొన్ని ఫలితాల్లో ప్రధాన పాత్ర జయదేవ్ గారిదే. ఈరోజు సొసైటీకి ఆయనకి తెలిసిందే కావాలి. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ఐదేళ్ళు ఏకాగ్రత తో పని చేస్తే దేశం మొత్తం గర్వించదగ్గ ఇండస్ట్రీ లిస్ట్ అవ్వగల స్థాయిలో వున్న అశోక్, ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైనటువంటి సినీ ఫీల్డ్ ని ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి ఆదరించమని అడుగుతున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదించాలి. ఇండస్ట్రీలో నిజాయితీగా పనిచేస్తే ఎవరికైనా స్థానం ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తే ఈ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. నిజాయితీగా పని చేస్తున్న అశోక్ గ్యారెంటీగా నిలబడతాడు. తప్పకుండా ఈ సినిమా పరిశ్రమ తనని నిలబడుతుంది. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల కి అశోక్ కి సింక్ చాలా బాగుంది. మొదటి సినిమా మనల్ని పరిచయం చేస్తుంది. రెండో సినిమా నువ్వేంటో చెబుతుంది. ఈ సినిమా ఈ ఇద్దరికీ అగ్నిపరీక్షే. ఈ అగ్ని పరీక్షని ఎదుర్కొని గ్యారెంటీగా నిలబడతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా తీశారు. ఐదు నిమిషాలు సినిమా చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే దాని అవుట్ పుట్ అలా ఉంది. మ్యూజిక్ విజువల్స్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఈ సినిమా చూడాలని ఆసక్తిని రేకెత్తించాయి. నేను కూడా అశోక్ ఇంట్రడక్షన్ చూడాలని ఎదురు చూశాను. ఈ కాన్ఫిడెన్స్ తో వాళ్లు ముందుగానే ఐదు నిమిషాల పాటు ఈ సినిమా చూపించడం అనేది అభినందించదగ్గ విషయం. తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి చూడాలని మంచి ఫీల్ వచ్చింది. థియేటర్ ఇదే ఫీల్ ఉండాలి. సినిమా మంచి హిట్ కావాలి. ఇలాంటి దర్శకులు హీరోలు బ్రహ్మాండంగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనం చేసిన కథ మరొకరికి ఇవ్వాలంటే మంచి మనసు ఉండాలి. అలా మంచి మనసుతో కథని ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారు ఎప్పుడూ బాగుండాలి. ఈ సినిమా 22వ తారీఖున విడుదలవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా కాదా అని ఉంటుంది. 100% మంచి సినిమా అని అనిపించింది. థియేటర్స్ లో కూడా అదే రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ’

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అశోక్ తన ఫస్ట్ సినిమా ‘హీరో’తో యాక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. సెకండ్ సినిమాకి ఇలా స్ట్రాంగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ చేయడం రిస్కీ. కాకపోతే తన కటౌట్ కమర్షియల్ హీరో కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ సాంగ్స్ చూసినప్పుడు తనకి పర్ఫెక్ట్ స్టొరీ అనిపించింది. తను కచ్చితంగా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు. అశోక్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సినిమా అంటే తనకి చాలా పాషన్. అశోక్ చాలా మంచి హీరోగా ఇక్కడ సెటిల్ అవుతాడు. నిర్మాత బాలా గారి దగ్గర ఒక స్టార్ ప్రొడ్యూసర్ క్వాలిటీ ఉంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా హానెస్ట్ గా మాట్లాడుతారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మానసకి చాలా లాంగ్ కెరియర్ ఉంటుందని నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. డైరెక్టర్ అర్జున్ గా హానెస్ట్ గా మాట్లాడారు. ఇదే హానెస్టీ మేకింగ్ లో ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు బోయపాటి గారి రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంత మంచి స్క్రిప్ట్ ఇచ్చిన ప్రశాంత్ కి థాంక్యూ. నవంబర్ 22న అందరూ థియేటర్స్ లోనే ఈ సినిమా చూడండి. థాంక్యూ’ అన్నారు.

హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. మన కష్టపడితే ఏదైనా మనకి వస్తుందని సుధీర్ బాబు గారిని చూసి నేర్చుకున్నాను .అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నారంటే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇచ్చారు. డెఫినెట్ గా ఇది ఇంట్రెస్టింగ్, ఎక్సయిటింగ్ గా వుంటుంది. ఆయన కథ ఇచ్చారు కాబట్టి ఈ ప్రాజెక్టు అయింది. బాలా గారు చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తీశారు. అర్జున్ గారు చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమాని అద్భుతంగా తలకెక్కించారు. అందుకే ప్రోడక్ట్ ఇంత అద్భుతంగా ఉంది. దేవదత్త గారు చాలా పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ చేశారు. ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. మానసకి ఇది తొలి సినిమా కానీ ఎక్కడ తొలి సినిమాలా ఉండదు. తనే తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది. మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మీ అందరినీ అలరించడానికి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈ ఈవెంట్ కి రాలేకపోయారు. ఆయన ఈ వేడుకలో లేకపోయినా ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉంటారు. ఆయన చెయ్యి ఎప్పుడూ నా భుజం మీద ఉంటుంది. అందులో డౌట్ లేదు. మా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో మీ ప్రేమ అభిమానం, నాకు కూడా కొంచెం వస్తుందని ఆశిస్తున్నాను. థాంక్యూ. నవంబర్ 22 థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ బాలా గారు చాలా కష్టపడి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ స్థాయికి వచ్చారు. సినిమా చేద్దామని అన్నారు. ముందు వద్దని చెప్పాను. అయితే ఆయన చాలా ప్యాషన్ తో ఉన్నారు. సరే అని అర్జున్ గారిని కలిసాం. ఆయన ఈ కథని ఓన్ చేసుకున్నారు. నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ క్యారెక్టర్ కి అశోక్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా మంచి మేకోవర్ అయ్యారు . క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేశారు. తన డెడికేషన్ తనని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మానస చాలా సిన్సియర్ గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది తనకి మొదటి సినిమా. ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మా అందరి కంటే బాలా గారు ఈ సినిమాని ఎక్కువ నమ్మారు. ఆయన కోసం ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన మరికొందరికి అవకాశాలు ఇస్తారు. డైరెక్టర్ అర్జున్ చాలా మ్యాసీగా ఈ సినిమాని తెరకెక్కించారు. అందరికీ ఆల్ ది బెస్ట్. 22 థియేటర్ కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయండి. ఆడియన్స్, సూపర్ స్టార్ మహేష్ గారి ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ లో చూడండి. సపోర్ట్ చేయండి. జై హనుమాన్. జైహింద్’అన్నారు.

గల్లా జయదేవ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఏడాదిన్నరగా అశోక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అన్ని చాలెంజెస్ ని ఎదుర్కొని ఫైనల్ గా ప్రోడక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారు, ప్రొడ్యూసర్ బాలా గారు, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ గారు.. అందరూ కలిసికట్టుగా ఈ సినిమాకి పనిచేశారు. ప్రశాంత్ గారు అద్భుతమైన కథలని తెలుగు ప్రేక్షకులను తీసుకొస్తున్నారు. ఈ కథ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సుధీర్ బాబు అశోక్ కి బిగినింగ్ నుంచి చాలా సపోర్ట్ గా ఉన్నారు. అశోక్, మానస స్క్రీన్ పై చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. వారిని ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అని భావిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ వన్ అండ్ ఆల్’ అన్నారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నాను. ఈ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్లో అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయి. స్టోరీని ఎలివేట్ చేయడానికి బీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ టీం తో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో సినిమా గురించి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అర్జున్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఒక గురువు లాగా ఉన్నారు. నాలోని సత్యభావని బయటికి తీసుకొచ్చారు. నిర్మాత బాల గారికి కంగ్రాజులేషన్స్. చాలా పాషన్ తో ఈ సినిమా తీశారు. ఇది వారి బ్యానర్ లో మైల్ స్టోన్ మూవీకి నిలుస్తుంది. అశోక్ గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా అంకితభావంతో పని చేశారు. నటిగా అర్థవంతమైన కథలు చెప్పాలని తొలి అడుగు వేస్తున్నాను. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం. థాంక్యూ’ అన్నారు.

డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఒక దర్శకుడిని నమ్మితే వాళ్లకి ఇచ్చే విలువ అంత ఇంత కాదు. అలాగే మా హీరో అశోక్ కూడా డైరెక్టర్ కి అంతే విలువ ఇచ్చిన యాక్టర్. అశోక్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. కలిసికట్టుగా పని చేశాము. అందుకే ఇంత అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది. ఈ సినిమా సాయి మాధవ్ బుర్ర గారు దేవుడంటే సాయం అనే డైలాగ్ రాశారు. ఈ సినిమాకి ప్రేక్షకులు రావాలంటే బలమైన వ్యక్తుల సహాయం కావాలి. అంత బలంగా మా సినిమా వెనుక నిలబడడానికి వచ్చిన సుధీర్ బాబు గారికి, నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రశాంత్ వర్మ గారికి, జయదేవ్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మా బాస్ మాస్ కల్ట్ డైరెక్టర్ బోయపాటి గారు ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రశాంత్ గారు ఈ సినిమా కథ ఇచ్చారు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆయనకి చూపించాను. చూసి ఆయన చాలా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు. చాలా అద్భుతంగా డెవలప్ చేసి తీశావ్ అన్నారు. హనుమాన్ లాంటి సినిమా తర్వాత ఆయన ఆ వర్డ్స్ చెప్పడం నా ఫస్ట్ సక్సెస్. థాంక్యూ ప్రశాంత్ గారు. ఈ సినిమా మీద నమ్మకంతో నిర్మాత బాల గారు మొదటి పది నిమిషాలు ముందే చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇంత బలంగా సినిమా నమ్మిన బాల గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అద్భుతమైన సినిమాని తీశారని ప్రశంసిస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి బీమ్స్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. సాంగ్స్ ఆర్ఆర్ అద్భుతంగా ఉంటాయి. 22 తారీఖున ఈ సినిమా చూడండి. కొత్త కంటెంట్. డివైన్ థీంతో తీసిన సినిమా. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఒక అద్భుతమైన సినిమాని విజువల్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.

యాక్టర్ దేవదత్త మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన డాక్టర్ గారికి హీరో గారికి అందరికీ ధన్యవాదములు. ప్రశాంత్ గారు ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా. ఈ పాత్రలో నన్ను ఎంచుకున్న ప్రశాంత్ గారికి థాంక్యూ సో మచ్. కంసరాజు క్యారెక్టర్ నాకు చాలా మెమొరబుల్. అశోక్ గారు నాకు యంగర్ బ్రదర్ లాంటివారు. తన సూపర్ స్టార్ అవుతారు. మానస అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ . ప్రాణం పెట్టి సినిమా తీశామ. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను.

నిర్మాత సోమినేని బాలకృష్ణ మాట్లాడుతూ… ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. సినిమా ఐదు నిమిషాలు ముందుగానే చూపించాం అంటే ఈ సినిమాపై మాకు ఉన్న నమ్మకం అది. ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్. ఈ సినిమా నిర్మాణంలో చాలా ఎత్తు పల్లాలు చూశాను. కొత్త నిర్మాతకి బతికించాలని కోరుకుంటున్నాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రశాంత్ వర్మ గారికి నేను రుణపడి ఉంటాను. జయదేవ్ గారి కోపరేషన్ ని మర్చిపోలేను. సినిమా అంటే చాలా ఫ్యాషన్ తో కథని నమ్మి ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశాం. అశోక్ గారు అద్భుతంగా నటించారు. రెండో సినిమాకే 20 కోట్లు మార్కెట్ చేశామంటే అది అశోక్ గారి వలనే పాజిబుల్ అయ్యింది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరి అంచనాలని అందుకునేలా వుంటుంది’ అన్నారు.

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. అశోక్ తాతగారు, మేనమామ ఇద్దరు సూపర్ స్టార్స్. తప్పకుండా తనపై ప్రెషర్ ఉంటుంది. అశోక్ గారి ఫస్ట్ సినిమా ‘హీరో’ చూశాను. అందులో తనొక కంప్లీట్ యాక్టర్ లా కనిపించారు. హీరోకి ఉండాల్సిన ఆల్ క్వాలిటీస్ అశోక్ లో ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. దీనికి మూడు కారణాలు.. ఒకటి అశోక్.. రెండు ప్రశాంత్ గారి స్టోరీ.. మూడోది డైరెక్టర్ అర్జున్. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను. ఆడియన్స్ సపోర్ట్ కూడా హీరోకి ఉండాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’ అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ జిఎం శేఖర్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మా డైరెక్టర్ గారికి మా హీరో గారికి థాంక్యూ. సినిమా చాలా బాగా వచ్చింది. గురువుకు తగ్గ శిష్యుడిలా డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు. నవంబర్ 22న తప్పకుండా అందరూ సినిమా చూడాలి’ అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది

Related Posts

Latest News Updates