బీహార్‌లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చరిత్ర సృష్టించారు. 40 ఏండ్లుగా గయ నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న చింతాదేవి అనే మహిళ ఇప్పుడు అదే నగరానికి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇంతకాలం నగరానికి చింతాదేవి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజలు ఆమెను 16 వేల రికార్డు మెజారిటీతో గెలిపించారు. పారిశుద్ధ్య కార్మికురాలు చింతా దేవి గయా డిప్యూటీ మేయర్ కావడం అన్నది చారిత్రాత్మకం అని గయా మేయర్ గణేశ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. చింతా దేవి పారిశుద్ధ్య పనేకాక కూరగాయలు అమ్మే వృత్తి కూడా చేశారు. చింతా దేవి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాత్సవ కూడా బలపరిచారు. ఎన్నికల్లో విజయం సాధించి ఆమె చరిత్ర సృష్టించారని శ్లాఘించారు. గయాలో ఇదేమి కొత్త కాదు. ఇంతకు మునుపు నిమ్న జాతికి చెందిన భగవతి దేవి కూడా 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.












