పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ సబబే : సమర్థించిన సుప్రీం కోర్టు

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీర్పును జస్టిస్ ఎన్.ఏ. నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 58 పిటిషన్లను ధర్మాసనం కొట్టి వేసింది. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లూ లేవని తేల్చి చెప్పింది.

 

పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి లోపభూయిష్టమూ లేదని, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, పన్ను ఎగవేతలు, ఉగ్రవాద గ్రూపులకు నిధులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం సుప్రీం ముందు వాదించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Related Posts

Latest News Updates