ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను నేలమట్టం చేస్తున్నారు. మరోవైపు ఎంత మాత్రమూ సురక్షితం కాని ఇళ్లకు ‘X’అనే గుర్తును వుంచారు. వీటి ఆధారంగా ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 678 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికు 4000వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.












