వైర్ ఫౌండర్ సిద్ధార్థ వరద రాజన్, ఎడిటర్ వేణు నివాసాలు, కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు

వైర్ పత్రిక ఫౌండర్ సిద్ధార్థ వరద రాజన్, సంస్థాపక ఎడిటర్ ఎమ్ కే వేణు నివాసాలు, కార్యాలయాల్లో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం నేత అమిత్ మాలవీయ ఇచ్చిన ఫిర్యాదుతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, తన పరువుకు భంగం కలిగేలా వైర్ వార్త రాసిందని మాలవీయ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసి, మొబైల్స్, ల్యాప్ టాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వారిపై కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, నోటీసులు జారీ చేయలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తిగా అయిపోయిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని పోలీసులు తెలిపారు.

 

వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్ టా గ్రామ్ మూలమై ‘మెటా’ మాలవీయకు కొన్ని ప్రయోజనాలను కల్పించిందని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టింగులను పక్కన బెట్టడానికి ఆయన వీటిని వినియోగించుకున్నారని ‘ది వైర్’ ఇటీవల తన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టుల్లో పేర్కొంది. సోషల్ మీడియా పోస్టులను అడ్డుకునేందుకు బీజేపీ ‘టెక్ ఫాగ్’ అనే సూపర్ హ్యూమన్ యాప్ ని వినియోగించుకుందని ఆరోపిస్తూ ఓ ఫేక్ కథనాన్ని వీరు తమ సైట్ లో ప్రచురించారని కూడా అమిత్ మాలవీయ విమర్శించారు.

 

Related Posts

Latest News Updates