ఢిల్లీ బిజెపి చీఫ్ ఆదేశ్ గుప్తా రాజీనామా

దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం సాధించింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్కార్పొరేషన్ పీఠాన్ని ఏలుతున్న బీజేపీకి ఈసారి భంగపాటు ఎదురైంది. దీంతో ఎంసీడీ ఎన్నికల్లో ఓటమికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్గుప్తా నైతిక బాధ్యత వహించారు. నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వచ్చిన సూచనల మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్పదవికి ఆదేశ్గుప్తా రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానాన్ని వీరేంద్ర సచ్దేవా భర్తీ చేస్తారని వెల్లడించాయి.

Related Posts

Latest News Updates