లాలూకు కిడ్నీ దానం చేయనున్న కూతురు రోహిణీ.. ఈ నెల 24 న లూలూకి కిడ్నీ మార్పిడి

కొన్నేళ్లుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ సమస్యలతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే… తన కూతురు రోహిణి ఓ కిడ్నీని తన తండ్రికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో లాలూ ప్రసాద్ కు కొత్త జీవితం రానుంది. సింగపూర్ వైద్యులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకోవాలని లాలూకు సలహా ఇచ్చారు. దీంతో తన కూతురు రోహిణీ కిడ్నీని తన తండ్రికి దానం చేసేందుకు నిర్ణయించుకుంది. అయితే.. లాలూ అందుకు ససేమిరా అంగీకరించలేదు. చివరికి కుటుంబ సభ్యులు ఒత్తిళ్లతో ఓకే చెప్పారు. ఈ నెల 24 న లాలూ మళ్లీ సింగపూర్ కి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోనున్నారు. అప్పుడే లాలూకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేస్తారని సమాచారం. తన కూతురు రోహిణీ సింగపూర్ లోనే నివాసం వుంటున్నారు.

Related Posts

Latest News Updates