దసరా ఫెస్టివల్‌కు ముందు నాని ట్రీట్ ఇచ్చాడు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నేచురాల్ స్టార్ నాని హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఈ సినిమా నుంచి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఊర మాస్ స్టెప్పులతో నాని అదరగొట్టాడు. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాని గెటప్ రిలీజ్ చేయగా.. అభిమానులకు తెగ నచ్చేసింది. నాని తొలిసారి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. నేచురాల్ స్టార్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అయితే ముందుగా చెప్పిన సమయానికి సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొంచెం లేట్.. జర్ర ఓపిక పట్టండి. ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ వస్తుంది..’ అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. అంతకుముందు 3 అవర్స్ టుగో.. 2 అవర్స్ టుగో.. వన్ అవర్ టుగో.. అంటూ అంచనాలను పెంచేసి.. చివరకు చెప్పిన టైమ్‌కు రిలీజ్ చేయకపోవడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఆ తరువాత ఇగ షురూ చెయుండ్రి అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. వచ్చే ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న దసరా మూవీ రిలీజ్ కానుంది శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1576901615042588677