దుబాయిలో నేటి నుంచి వేంకటేశ్వరుని దర్శనాలు

దుబాయి నగరంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నేటి నుంచి  భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దుబాయిలోని జబల్‌ అలీలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయ ప్రాంగణంలో తిరుమల వెంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది. పూర్తి ఆగమ శాస్త్ర ఆచారాలతో అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ఈ ఆలయ సముదాయంలో ఇక్కడి భక్తుల మనోభావాలకు అనుగుణంగా వివిధ దేవతామూర్తలను ప్రతిష్ఠించగా, అందులో తెలుగు నాట భక్తుల పాలిట కొంగు బంగారమైన ఏడుకాసుల వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఒకటి. నేటి నుంచి https://hindutempledubai.qwaiting.com/main/booking   నుంచి వెబ్‌సైట్‌ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకున్న వారిని మాత్రమే స్వామి వారిని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శించుకోవడానికి ఆలయ నిర్వాహకులు అనుమతిస్తారు. ప్రస్తుతానికి స్వామి వారికి భక్తులు ఎలాంటి ధూప దీప నైవేద్యాలు సమర్పించడానికి అవకాశం లేదు. అక్టోబరులో దేవాలయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో అక్టోబరు 4 నుంచి భక్తులు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా నేరుగా దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. 1947కు పూర్వం నుంచి దుబాయిలో నివసిస్తున్న సింధీ వ్యాపారస్తులతో కూడిన సింధీ గురు దర్బార్‌ మందిర నిర్వహణ ట్రస్ట్‌ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది.

 

Related Posts

Latest News Updates