‘డార్లింగ్’ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు : హీరో ప్రియదర్శి

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

కమెడియన్ గా మొదలై సీరియస్ కథలు చేస్తూ డార్లింగ్ తో లవర్ బాయ్ గా వస్తున్నారు.. ఎలా అనిపిస్తోంది ?
-ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కంటెంట్ కి మంచి రోజులు వచ్చాయని భావిస్తాను. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే… ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ వుందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా వుంటుంది.

డార్లింగ్ ఆన్ పేపర్ సీరియస్ కథలా అనిపిస్తోంది, దాని హ్యుమర్ అండ్ ఎంటర్ టైనింగ్ చెప్పడం ఛాలెజింగ్ గా అనిపించిందా?
-జనరల్ గా మ్యారేజ్ ని చాలా స్టీరియోటిపికెల్ అప్రోచ్ లో చూస్తాం. డార్లింగ్ విషయానికి వస్తే.. విమన్ క్యారెక్టర్ స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ వుంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా వుంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.

కంటెంట్ పిక్ చేయడానికి మీకు టీం ఉందా?
-లేదండీ. స్క్రిప్ట్ ఛాయిస్ నాదే. స్క్రిప్ట్ క్లియర్ గా చదుతాను. కొన్నిసార్లు డౌట్స్ వున్నప్పుడు రాహుల్, విష్ణు, నా మెంటర్ సీతారామ్ తో చర్చిస్తాను. సీతారామ్ డార్లింగ్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు.

నభా నటేష్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా వుందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటాయి.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-మేము కథ తీసుకువెళ్ళే సమయంలో హనుమాన్ ప్రోమో బయటికి వచ్చింది. డార్లింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి హనుమాన్ ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. డార్లింగ్ ని చేయాలనే నిర్ణయం ముందే తీసుకున్నారు. నిరంజన్ గారు, చైతన్య గారు ట్రూ డార్లింగ్స్. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

డైరెక్టర్ అశ్విన్ రామ్ గురించి ?
సందీప్ కిషన్ ‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’ షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం అశ్విన్ ని కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్ , కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్  వున్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.

డార్లింగ్ టైటిల్ పెట్టడం ప్రెషర్ అనిపించిందా ?
-ప్రెషర్ వుంది. అయితే స్క్రిప్ట్ మీద నమ్మకం వుంది. ఈ సినిమాకి పెర్ఫెక్ట్ టైటిల్ ఇది. డార్లింగ్ అనే టైటిల్ చాలా ప్రేమతో పెట్టాం.

నాని గారిలానే మీరు కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు కదా ఆయన ప్రభావం మీపై ఎంత వరకు వుంది ?
– దసరా లాంటి మాస్ మసాలా సినిమా చేసిన తర్వాత హాయ్ నాన్న లాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. నాని అన్న ప్రేక్షకులకు డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా ఇన్స్ప్రెషనల్ గా అనిపిస్తుంటుంది.

-హాయ్ నాన్న సినిమా షూటింగ్ సమయంలో జగదీశ్ రాసిన కథ సరదాగా చెప్పాను. కథ విన్న వెంటనే సినిమా చేస్తున్నాం, షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారు

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ?
– మేము ఫ్రెండ్స్ గా కలిసి పెరిగాం. వివేక్ సాగర్ కి ఇది 25వ సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, తన గ్రోత్ చూస్తున్నప్పుడు ఆనందంగా వుంటుంది.

డార్లింగ్ లో డ్యాన్సులు కూడా చేసినట్లుగా వున్నారు ?
-నాకూ తెలీదు నేను చేస్తానని. (నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది.

ఆడియన్స్ ని థియేటర్స్ లో రప్పించడానికి డార్లింగ్ లో ఎలాంటి అంశాలు వున్నాయి ?
-ఏడాదికి వంద సినిమాలు వస్తే థియేటర్స్ లో చూసి గుర్తుపెట్టుకుని నవ్వుకునే సినిమాలు నాలుగు వున్నాయి. డార్లింగ్ కూడా అలా గుర్తుపెట్టుకొని నవ్వుకునే సినిమా అవుతుంది. డార్లింగ్ లో కావల్సినంత కామెడీ వుంది, మంచి మ్యూజిక్ వుంది. డార్లింగ్ తప్పకుండా ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. దిన్ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ థియేటర్స్ కి రావాలని కోరుకుంటున్నాను.

కొత్త సినిమాల గురించి ?
ఆగస్ట్ 15న 35 చిన్న కథ కాదు వస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా వుంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి.

Related Posts

Latest News Updates