లఖీంపూర్ లో దళిత అమ్మాయిలపై అత్యాచారం… ఆపై హత్య…

యూపీలోని లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత అక్కాచెల్లెల్లను కొందరు యువకులు అత్యాచారం చేసి, హత్య చేశారు. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. వారిని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోహైల్, జునైద్ అనే యువకులు అమ్మాయిలపై అత్యాచారం చేశారని, ఆపై వారిని హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇక… కరీముద్దీన్, ఆరీఫ్ అనే మరో ఇద్దరు బాలికలను ఉరితీశారని పోలీసులు తెలిపారు. ఇక దీనిపై బాలికల కుటుంబీకులు స్పందించారు. తమ బిడ్డల్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, ఆపై లైంగిక దాడి చేసి, చెట్టుకు వేలాడదీశారని అనుమానాలు వ్యక్తం చేశారు.

 

 

ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అనుమానం వున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. విచారణ జరుగుతోందని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో వైపు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాధితుల్ని రేప్ చేసి, హ‌త్య చేసిన‌ట్లు అటాప్సీ నివేదిక‌లో తేల్చారు. అక్కాచెల్లెళ్ల‌ను చెట్టుకు ఉరివేసి వేలాడ‌దీసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరుగుర్ని అరెస్టు చేశారు. చోటూ, జునైద్‌, సుహేల్‌, క‌రీముద్దీన్‌, ఆరిప్‌, హ‌ఫీజ్ ఆ లిస్టులో ఉన్నారు. బాధిత కుటుంబానికి భౌతిక‌కాయాల‌ను అప్ప‌గించిన‌ట్లు అద‌న‌పు డీజీ ప్ర‌శాంత్ కుమార్ తెలిపారు.

Related Posts

Latest News Updates