దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన… రాజకీయాలకు

దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను,  తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, లోక్సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు.

Related Posts

Latest News Updates