పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద బోస్

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, స్పీకర్ బిమన్ బెనర్జీ, మంత్రులు హాజరయ్యారు. 1977 బ్యాచ్ కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన బోస్… నేడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే… ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సుబేందు అధికారి హాజరు కాలేదు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ గా వున్న ధన్కర్ ను ఎన్డీయే కూటమి ప్రకటించడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త గవర్నర్ వచ్చే వరకూ మిజోరాం గవర్నర్ గణేషన్ బెంగాల్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు… సీవీ ఆనంద బోస్ పూర్తి కాలపు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Latest News Updates