ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా వున్న నంద కుమార్ కు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. అలాగే 10 వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నంద కుమార్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ నిందితుడిగా వున్నారు. ఆయనతో పాటు రామచంద్ర భారతి, సింహయాజీలకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే మరో కేసులో నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నందకుమార్కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.